హైదరాబాద్: పుష్ప-2 తొక్కిసలాట కేసులో ముగ్గురు అరెస్ట్

76చూసినవారు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానితోపాటు సెక్యూరిటీ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. థియేటర్ వద్ద సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే రేవతి అనే వివాహిత చనిపోయినట్లు ఆదివారం పోలీసులు తేల్చారు.

సంబంధిత పోస్ట్