సికింద్రబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద శనివారం పోలీసులు చేసిన లాఠీచార్జిలో కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త వెంకటేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెంకటేష్ ఇంటికి వచ్చి పరామర్శించారు. శాంతియుత నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు.