ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తోంది. 24 డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. 27, ఏప్రిల్ 26, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో ఉప్పల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఘట్కేసర్, ఎల్బీనగర్, కోఠి, కొండాపూర్, మేడ్చల్, ఈసీఐఎల్, చార్మినార్, మెహిదీపట్నం, బీహెచ్ఐఎల్ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.