బౌద్ధ నగర్ డివిజన్ పరిధిలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కంది శైలజ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతగా తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఎల్లప్పుడూ నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.