ఉప్పల్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి 37 కంప్యూటర్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, వైట్ బోర్డు, సిట్టింగ్ చైర్స్, టేబుల్స్, కీ బోర్డులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్నత చదువులు చదవలేని విద్యార్థులకు తను ఆర్థిక సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.