జిల్లాలో పలుచోట్ల వర్షం.. రైతుల్లో ఆనందం

73చూసినవారు
వికారాబాద్ జిల్లాలోని పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండ వేడిమి ఉండగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రెండు రోజుల్లో జిల్లాలోని భారీ వర్షం కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్