ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని మధురాపూరి కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.