నిత్యం రాజకీయాలతో తలమునకలయ్యే ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మందుముల పరమేశ్వర్ రెడ్డి సంక్రాంతి పండుగను సంబురంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మంగళవారం తన బాల్య మిత్రులతో కలిసి గాలిపటాలను ఎగురవేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్నారులు జాగ్రత్తగా గాలిపటాలను ఎగురవేయాలని సూచించారు.