HMDA పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో హైడ్రా గుబులు రేపుతోంది. అయితే గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు సహాయక పనుల్లో నిమగ్నం అయ్యారు. దాంతో సిటీలో కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చింది. హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికే 200కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూల్చివేతల పనిలో హైడ్రా బిజీగా ఉండనుంది.