సికింద్రాబాద్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పర్యటన

64చూసినవారు
సికింద్రాబాద్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పర్యటన
సికింద్రాబాద్‌లో మంగళవారం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పర్యటించారు. మచ్చ బొల్లారం హిందూ స్మశాన వాటికను పరిశీలించారు. శ్మశానవాటికలో నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో రంగనాథ్‌ చర్యలు చేపట్టారు. శ్మశానవాటికలో నిర్మాణాలు చేపట్టవద్దని ఆల్వాల్‌ డిప్యూటీ కమిషనర్‌కు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్