TG: BRS MLA కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. చర్యలు తీసుకోవాలని కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను BRS MLAగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పేరుతో ఫ్లెక్సీలు వేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనను అప్రతిష్ట పాలు చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ గద్వాల PSలో MLA ఫిర్యాదు చేశారు.