బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నేటితరం నటీనటులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న నటీనటుల్లో క్రమశిక్షణ, నిబద్ధత లోపించిందని అన్నారు. తాము ఈ స్థాయికి చేరామంటే దానికి కారణం క్రమశిక్షణ, పనిపై శ్రద్ధ, నిబద్ధత అని పేర్కొన్నారు. అలాగే తనకు స్టార్‌లా ఉండటం నచ్చదని, స్టార్స్ రాత్రి సమయంలోనే కనిపిస్తాయని, సూర్యుడిలా బ్రతకం ఇష్టమని, అందుకే ఉదయం లేచి పనులు ప్రారంభిస్తానని చెప్పారు.