AP: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరై రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వచ్చేస్తానని బయలుదేరిన యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. రాజమహేంద్రవరం సమీపంలోని గామన్ వంతెనపై జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంలో ఆంధ్రకేసరి నగర్‌కు చెందిన కే.హోమినీ కళ్యాణి (21) మృతి చెందారు. ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.