దేశభక్తి ఉంది కాబట్టే భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కానీ, దానిపై కూడా కొందరు తనని ఎగతాళి చేశారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్ వెళ్లి ఐసీసీ చైర్మన్ జై షాను కలిశానని, ఏపీ రాజధాని అమరావతిలో అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం కంటే పెద్ద స్టేడియం కడతామని ఆయనకు చెప్పానని అన్నారు. దేశంలో అతిపెద్ద స్టేడియం అమరావతిలో కట్టేందుకు జై షా ఒప్పుకున్నారని లోకేష్ తెలిపారు.