సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీటింగ్స్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమిళ మూవీ జైలర్ చూసి మహేశ్ బాబు ఫోన్ చేసి ఈ తరహా కథకు మీదైన కామెడీ జోడించి చేస్తే బాగుంటుందని చెప్పడంతో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి బీజం పడిందని తెలిపారు. అలాగే తనకు ఖాళీ సమయం దొరికితే పాత సినిమాలు చూస్తానని, ఎక్కువగా జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, కృష్ణారెడ్డి మూవీలు చూస్తానని పేర్కొన్నారు.