యూపీలోని నోయిడాలో షాకింగ్ ఘటన జరిగింది. సెక్టార్ -73 ఏరియాలో 32 ఏళ్ల మహిళ భవనం ఎక్కి ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని ప్రతాప్‌గఢ్ కు చెందిన పూజ (32) గా పోలీసులు గుర్తించారు. మహిళ ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.