TG: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… సూర్యపేటకు ఎస్‌ఆర్‌ఎస్పీ, దేవాదుల నీళ్లు తీసుకొస్తే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళ్లు కడిగి.. ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకుంటా అని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులవి చేత కానీ మాటలని విమర్శించారు. దమ్ముంటే ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.