మీ IRCTC ఐడీపై ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే

56చూసినవారు
మీ IRCTC ఐడీపై ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే
ఐఆర్‌సీటీసీలో అకౌంట్ ఉన్నవాళ్ళు కొన్నిసార్లు తెలిసినవారికి టికెట్లు బుక్ చేస్తుంటారు. అయితే, ఇకపై అలా కుదరదు. మీ IRCTC అకౌంట్లో ఇతరులకు రైలు టికెట్లు బుక్ చేస్తే రూ.10వేల ఫైన్, 3 ఏళ్ల జైలు శిక్ష అవకాశముంది. రైలు రిజర్వేషన్లపై కొత్త రూల్స్ తాజాగా అమల్లోకి వచ్చాయి. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం ఆధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. మీ ఇంటి పేరు ఉన్న వారికే మీ ఐడీతో టికెట్లు బుక్ చేయవచ్చు.