పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా పాలకూర జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. గుండె సమస్యలను కూడా పాలకూర జ్యూస్ దూరం చేస్తుంది. కంటి సంబంధిత సమస్యలు దూరమవలంటే పాలకూర జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకోవాలి.