ప్రతి నెల రూ.42 కడితే చాలు.. లైఫ్ టైం పెన్షన్..!

575చూసినవారు
ప్రతి నెల రూ.42 కడితే చాలు.. లైఫ్ టైం పెన్షన్..!
అన్ని వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయి. ఈరోజు నుంచి డబ్బు జమ చేయడం ప్రారంభిస్తే 60 ఏళ్ల నుంచి బతికున్నంత వరకు పెన్షన్ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం మీరు కేవలం 42 రూపాయలు మాత్రమే పెట్టుబడి చేయాల్సి ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన. ఈ పెన్షన్ పథకం కింద, 60 ఏళ్ల వయస్సు నుండి మీరు రూ.1000, 2000, 3000, 4000 లేదా 5000 ప్రతినెలా పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్