తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలు ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని గ్రామాల్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని తెలిపారు.