రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు అమలు?

83చూసినవారు
రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు అమలు?
రైతు రుణమాఫీ గైడ్‌లైన్స్ రూపొందించడంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో పీఎం కిసాన్ స్కీం నిబంధనలను అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లించేవారు తదితరులకు కేంద్రం పీఎం కిసాన్ అమలు చేయడం లేదు. రుణమాఫీకి కూడా ఇవే మార్గదర్శకాలు అనుసరిస్తే అర్హులైన వారికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తుందట.

సంబంధిత పోస్ట్