హై బీపీ రావద్దంటే.. వ్యాయామం రెట్టింపు చేయాల్సిందే

64చూసినవారు
హై బీపీ రావద్దంటే.. వ్యాయామం రెట్టింపు చేయాల్సిందే
హై బీపీ నివారణపై ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు 5 వేల మందిపై యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌’ ప్రచురించింది. హై బీపీ సమస్య పెరగడానికి కారణం.. 18- 40 ఏండ్ల వాళ్లలో వ్యాయామం చేసేవాళ్లు గణనీయంగా తగ్గడమేనని నివేదిక తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్