గొర్రెల కొనుగోళ్ల పేరిట.. రూ. 700 కోట్ల కుంభకోణం

71చూసినవారు
గొర్రెల కొనుగోళ్ల పేరిట.. రూ. 700 కోట్ల కుంభకోణం
గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్టు చేసి విచారణ చేస్తోంది. అయితే మనీలాండరింగ్ కోణంలో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్