హైదరాబాద్లో వైరల్ జ్వరాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే వైరల్ ఫీవర్ వస్తే నాలుగైదు రోజుల్లో అదే తగ్గిపోతుంది. కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా లేదని వైరల్ ఫీవర్లు పదిరోజుల దాకా కూడా ఉంటున్నాయని.. కొందరిలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురై న్యూమోనియా బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వారిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోతుండడంతో ఐసీయూలో చేర్చి చికిత్స చేయాల్సివస్తోందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.