యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరుగుతుంది. సంక్రాంతి పండుగకు ఊరెళ్లేందుకు హైదరాబాద్ వాసులు కదలడంతో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతన్నాయి. శుక్రవారం ఒక్కరోజే పంతంగి టోల్‌ప్లాజా నుంచి 59 వేల వాహనాలు వెళ్లాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు టోల్‌ప్లాజా నుంచి 55 వేల వాహనాలు వెళ్లాయి. సాయంత్రం నుంచి వాహనాల రద్దీ పెరుగుతుంది.