ఈ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: పేర్ని నాని

71చూసినవారు
ఈ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: పేర్ని నాని
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం గుంటూరులో అడిషనల్ సీఈఓను వైసీపీ నేతలు మాజీ మంత్రి పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పేర్ని నాని మాట్లాడుతూ.. ‘పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బీ నిబంధనలు చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్