ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రకాశిస్తోంది: IMF

69చూసినవారు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రకాశిస్తోంది: IMF
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని భారత్ సాధించగలదని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రకాశిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది కూడా. 2024 భారత వృద్ధి అంచనాలను 6.5 శాతానికి పెంచుతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ 2023లో చాలా బలమైన పనితీరు కనబర్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని క్రిస్టలినా వివరించారు.

సంబంధిత పోస్ట్