2030కి మూడో అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్‌గా భారత్

81చూసినవారు
2030కి మూడో అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్‌గా భారత్
భారత్ ఇ-కామర్స్‌ మార్కెట్ విలువ 2030కి $325 బిలియన్లకు చేరుతుందని ఎన్వీఈఎస్టీ ఇండియా వెల్లడించింది. ఫలితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్‌గా నిలుస్తుందని అంచనా వేసింది. ‘ప్రస్తుతం భారత్‌కు 88.1 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఆన్‌లైన్ షాపర్ బేస్ కూడా పెరుగుతోంది. మార్కెట్ వృద్ధికి ఇవే కారణాలు’ అని పేర్కొంది. కాగా 2025కి దేశంలోని 87% ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్