భారత్ వారికి తగిన బుద్ధి చెబుతుంది: సీఎం

81చూసినవారు
భారత్ వారికి తగిన బుద్ధి చెబుతుంది: సీఎం
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు మరణించడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. ‘ఈ ఘటనకు పాల్పడిన పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి భారత్ తగిన బుద్ధి చెబుతుంది. సైనికుల ప్రాణాలను బలి తీసుకున్నవారిని వదిలిపెట్టేది లేదు. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు మోదీ సర్కార్ కృషి చేస్తోంది. పాకిస్థాన్ కుట్రను ఎదుర్కొంటుంది’ అని హిమంత పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్