18 మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

81చూసినవారు
18 మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం
అహ్మదాబాద్‌లో నివసిస్తున్న పాకిస్తాన్‌కు చెందిన 18 మంది హిందూ శరణార్థులకు శనివారం గుజరాత్ హోం శాఖ సహాయమంత్రి హర్ష్ సంఘవి భారత పౌరసత్వం అందించారు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే మైనారిటీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వం మంజూరు చేసే అధికారాన్ని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లా కలెక్టర్లకు గతంలోనే కేంద్రం అప్పగించింది. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 1,167 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది.

సంబంధిత పోస్ట్