శ్రీలంకతో జరిగిన తొలి T20లో భారత బౌలర్ రవి బిష్ణోయ్ గాయపడ్డారు. అతను వేసిన 16వ ఓవర్‌లో తొలి బంతికే లంక బ్యాట్స్‌మెన్ కమిందు మెండిస్ ఔటయ్యాడు. దాన్ని రిటర్న్ క్యాచ్ పట్టుకునేందుకు బిష్ణోయ్ ప్రయత్నించాడు. అందుకునే క్రమంలో అతని కంటి కింద బంతి బలంగా తాకింది. దీంతో అతని ఫేస్ పై చిన్న గాయం అవ్వడంతో బ్లడ్ వచ్చింది. ఆ తర్వాత బ్యాండేజీ వేసుకుని ఆట కొనసాగించాడు. దీంతో బిష్ణోయ్ డెడికేషన్‌పై ప్రశంసలు వస్తున్నాయి.