AP: విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో విషాదం జరిగింది. చదువు విషయంలో లెక్చరర్లు మందలించారని చంద్ర వంశీ (17) అనే విద్యార్థి కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న SFI కార్యకర్తలు విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ నిరసనకు దిగారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని SFI కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.