తెలంగాణలో కులగణన సర్వేతో రూ.200 కోట్లు వృధా చేశారని బీఆర్‌ఎస్ MLA కేపీ వివేకానంద ఆరోపించారు. రేవంత్ సర్కార్ 2 నెలల్లో రూ.200 కోట్లు వృధా చేసిందని, కులగణన సర్వేతో వాళ్లు బలహీన వర్గాల వారిని గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేను సరిగా చేయడం చేతకాని ప్రభుత్వం, మంచి పాలన ఎలా అందిస్తుందని కేపీ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఏదీ చేసినా తిరోగమనమే అని, అన్నింటా అభాసు పాలవుతోందని MLA ఎద్దేవా చేశారు.