త్వరలోనే కొడాలి నాని అరెస్ట్: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

56చూసినవారు
త్వరలోనే కొడాలి నాని అరెస్ట్: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
AP: గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారెవరైనా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలకు తావులేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో దుర్మార్గాలు, అవినీతికి పాల్పడిన వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని వెల్లడించారు. అలాగే కొడాలి నాని అరెస్టు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. కాగా, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలిసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్