బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో అనయ జేతానందిని పదకొండో తరగతి చదువుతుంది. ఓరోజు ఆమె వంటమనిషి ఏడ్చుకుంటూ తన సంపాదన తీసుకొని తన భర్త హింసిస్తున్నాడని చెప్పింది. ఈ ఘటన అనయను ఎంతగానో కదిలించింది. దీంతో నిరుపేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, వృత్తి నైపుణ్యాలు నేర్పించేందుకు ఫిన్విన్ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ నిరుపేదల మహిళలకు ఆర్థిక అక్షరాస్యతను నేర్పిస్తూ, వారి జీవితాలను మారుస్తుంది.