‘స్మాల్ సేవింగ్స్’పై వడ్డీ రేట్లు యథాతథం

59చూసినవారు
‘స్మాల్ సేవింగ్స్’పై వడ్డీ రేట్లు యథాతథం
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో వడ్డీ రేట్లను జనవరి-మార్చి తరహాలోనే ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సుకన్య సమృద్ధి యోజనపై 8.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1, పీపీఎఫ్‌పై 7.1, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్‌పై 4, కిసాన్ వికాస పత్రపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7 శాతం, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ అమలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్