ఏపీలోని మహిళలకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందని, మున్సిపాలిటీల్లో బ్లీచింగ్‌కు కూడా డబ్బులు లేకుండా చేశారని ఆరోపించారు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున తల్లుల ఖాతాల్లో మే లోగా జమ చేస్తామని అన్నారు. ఆస్తిలో సగభాగం మహిళలకు ఇచ్చింది టీడీపీ అని, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చామని గుర్తుచేశారు.