సిమ్రంజోత్ సంధు అనే అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్‌ను సెంట్రల్ ఏజెన్సీలతో కలిసి జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు శనివారం ప్రకటించారు. 2020లో జర్మనీలో 487 కిలోల కొకైన్ స్మగ్లింగ్ కేసులో సిమ్రంజోత్ సంధు నిందితుడన్నారు. స్థానిక డ్రగ్స్ స్మగ్లర్లు బియాంత్ సింగ్, సుఖ్‌దీప్ సింగ్‌లను అరెస్టు చేశాక సిమ్రంజోత్ సంధు విషయం బయటికొచ్చిందన్నారు. చివరికి నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు.