AP: విజయవాడ రూరల్‌కు చెందిన నాగదుర్గ ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయారు. కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఆమెకు సత్తెనపల్లికి చెందిన కొక్కిలిగడ్డ మోజెస్ ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరూ శారీరకంగా కలిశారు. కొన్ని రోజులు విజయవాడలో సహజీవనం చేశారు. అయితే పెళ్లి చేసుకోవాలని నాగదుర్గ కోరగా.. ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దాంతో నాగదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.