ఐపీఎల్ 2024: రికార్డు సృష్టించిన హెడ్

1105చూసినవారు
ఐపీఎల్ 2024: రికార్డు సృష్టించిన హెడ్
బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్(102) సెంచ‌రీ బాదాడు. ఈ విధ్వంస‌క ఓపెన‌ర్ 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్స‌ర్ల‌తో వంద పూర్తి చేసుకున్నాడు. దాంతో IPL చ‌రిత్ర‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టిన 4వ ఆట‌గాడిగా హెడ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(30 బంతుల్లో 100) టాప్‌లో ఉన్నాడు. ఇక యూసుఫ్ ప‌ఠాన్ (37), డేవిడ్ మిల్ల‌ర్ (38) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్