ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. మార్చి 22 నుండి ఈ ధనాధన్ లీగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న స్టార్ ప్లేయర్ రీస్ టోప్లీ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం టోప్లీకి బదులు క్రిస్ జోర్డాన్‌ను RCB ఫ్రాంచైజీ ఎంపిక చేసిందని సమాచారం.