శుభ్రత వీఐపీల కోసమేనా.. నిత్యం ఎందుకు చేయరు?

51చూసినవారు
శుభ్రత వీఐపీల కోసమేనా.. నిత్యం ఎందుకు చేయరు?
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, మునిసిపల్‌ అధికారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రధాని, వీవీఐపీలు వచ్చినప్పుడు శుభ్రం చేస్తున్నప్పుడు, సామాన్యుల కోసం ఎందుకు చేయారని ప్రశ్నించింది. పన్నులు కట్టేది పౌరులని, వారు నడిచేందుకు మంచి పాదచారుల బాట ఉండాలని తెలిపింది. అవే లేకుంటే వాటిపై నడవాలని పిల్లలకు ఏం చెబుతామని మండిపడింది.

సంబంధిత పోస్ట్