TG: ‘ట్యాంక్ బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలు తొలగించే దమ్ముందా’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన మాట్లాడారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏమిటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన గొప్ప దేశభక్తుడని, ఏపీ మూలాలుంటే పేర్లను మార్చేస్తారా అని ప్రశ్నించారు. NTR, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మారుస్తారా? అని అన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.