AP: ఉప ముఖ్యమంత్రి పవన్ చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పుడు ఆయన మోడీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని ఆరోపించారు. ‘RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారని, జనసేన పార్టీని "ఆంధ్ర మతసేన" పార్టీగా మార్చారు’ అని షర్మిల అన్నారు. పవన్ బీజేపీ మైకం నుంచి బయట పడాలన్నారు.