బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఆ రాష్ట్రంపై BJP ప్రేమ కురిపించిందని కాంగ్రెస్ విమర్శించింది. బీహార్‌కు కేటాయింపుల్లో పెద్దపీట వేశారని, APని దారుణంగా నిర్లక్ష్యం చేశారని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ విమర్శించింది. 'ఇది భారత ప్రభుత్వ బడ్జెట్టా? బీహార్ బడ్జెట్టా అనేది అర్ధంఅర్థం కాలేదు. ఆర్థిక మంత్రి పూర్తి ప్రసంగంలో బీహార్ మినహాయిస్తే మరో రాష్ట్రం పేరైనా వినిపించిందా?' అని ప్రశ్నించింది.