హనుమంతుడు బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ఆలయంలో ఆంజనేయస్వామిని స్త్రీ రూపంలో పూజిస్తారు. ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నగరానికి 25 కి.మీ దూరంలో ఉన్న రతన్‌పూర్‌లో ఉంది. హనుమంతుడు స్త్రీ రూపంలో పూజించబడే ప్రపంచంలోని ఏకైక ఆలయం ఇదే. రతన్‌పూర్‌లోని గిర్జాబంధ్‌లో ఉన్న ఈ ఆలయంలో దేవి హనుమంతుని విగ్రహం ఉంది. ఇక్కడ పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.