తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులతో పాటు ఆల్ ఇండియా సర్వీసు అధికారులు, గ్రూప్-1, 2 అధికారులకూ ఈ పథకం అమలు చేయకూడదని కమిటీ ప్రతిపాదించింది. అయితే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే విషయమై ప్రభుత్వం ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.