AP: కూటమి ప్రభుత్వం, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్పై మాజీ CM జగన్ విమర్శలు చేశారు. ఆలయాల పరిరక్షణపై, హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్కు లేదని అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్కమాట మాట్లాడలేదని, ఆలయాల పట్ల తమకున్న చిత్తశుద్ధి కూటమి సర్కార్కు లేదని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే కాశీ నాయన క్షేత్రాన్ని కూల్చేసిందని, అదే ఆలయ అభివృద్ధికి YCP సర్కార్ ఎంతో కృషి చేసిందని జగన్ తెలిపారు.