పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో శనివారం నిరుపేద వృద్ధులకు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరగొండ సత్యనారాయణ గౌడ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర రమేష్ గౌడ్, శ్యాంసుందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.